ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

04-09-2026 Fri 08:51 | Andhra
Advertisement
  • మార్గదర్శకాల సవరణ కోసం 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు
  • సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కొత్త నిబంధనల రూపకల్పన
  • ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 173 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
Advertisement
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉండగా, ఈ విధానంలో ఉన్న మార్గదర్శకాలను సవరించి, పటిష్ఠంగా అమలు చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ రిజర్వేషన్ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా ఉంటారు. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు. 

ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను సవరించి, పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీ త్వరలోనే సమావేశమై కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

173 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
మరోవైపు రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విశేష సేవలు అందించిన వారికి 'రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2026'ను ప్రకటించింది. మొత్తం 173 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో పాఠశాల విద్యా విభాగం నుంచి 79 మంది, ఇంటర్ విద్య నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14 మంది, ఉన్నత విద్యా విభాగం నుంచి 56 మంది ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీరికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, పతకం, శాలువాతో పాటు రూ. 20 వేల నగదు బహుమతిని అందించి ఘనంగా సత్కరించనున్నారు.
Advertisement
AP GovernmentPrivate School Free AdmissionsRight to Education ActTameem AnsariaChandrababu NaiduState Best Teacher Awards

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more